For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు చిత్రంగా ముగిశాయి. ఓపెనింగ్‌ నుంచి లాభాల్లో ఉన్న డౌజోన్స్ నష్టాల్లో క్లోజ్‌ కాగా, నష్టాల్లో ఉన్న నాస్‌డాక్‌ 0.7 శాతంపైగా లాభంతో ముగిసింది. రేపు ఫెడ్‌ మీటింగ్‌ నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు జాగ్రత్తగా ట్రేడవుతున్నాయి.నిన్న సెలవులో ఉన్న చైనా, హాంగ్‌సెంగ్‌తో పాటు పలు మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ఉన్నాయి. ఒకశాతంపైగా నష్టాల్లోఉండటం విశేషం. నిన్న పనిచేసిన జపాన్‌ నిక్కీ ఇవాళ కూడా గ్రీన్‌లో ఉంది. సింగపూర్ నిఫ్టి స్వల్ప నష్టంతో ట్రేడవుతోంది. ఈనేపథ్యంలో నిఫ్టి స్వల్ప నష్టంతో లేదా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. రిలయన్స్‌ వంటి షేర్లు ఇవాళ మార్కెట్‌కు మద్దతు ఇస్తాయేమో చూడాలి.కాని ద్రవ్యోల్బణ రేట్లు మార్కెట్లను భయపెడుతున్నాయి.