For Money

Business News

నిఫ్టికి మద్దతు ఎక్కడ లభిస్తుంది?

సింగపూర్‌ నిఫ్టి 53 పాయింట్ల నష్టంతో ప్రారంభం కానుంది. నిఫ్టి క్రితం ముగింపు 15799. ఈ లెక్కన నిఫ్టి తొలి మద్దతు స్థాయి 15,757 లేదా 15,746 వద్ద ప్రారంభమయ్యే అవకాశముంది. 15,730 దిగువకు చేరితే నిఫ్టిలో స్వల్ప కరెక్షన్‌ రావొచ్చు. 15700 -15,730 మధ్య నిఫ్టికి మద్దతు లభిస్తే క్రితం ముగింపు వరకు వెళ్ళొచ్చు. రిస్క్‌ వొద్దనుకునేవారు స్వల్ప లాభాలతో బయటపడొచ్చు. లేదా క్రితం ముగింపు వరకు వెయిట్‌ చేయొచ్చు. నేడుకీలక ఆసియా మార్కెట్లకు సెలవు. యూరో మార్కెట్లలో పెద్ద ఉత్సాహం ఉండకపోవచ్చు. అలాగే ఈవారంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ఉంది. అప్పటిదాకా నిఫ్టిలో భారీ అప్‌ట్రెండ్‌ అనుమానమే. నిఫ్టి డల్‌గా ఉండటానికి ప్రధాన కారణంగా బ్యాంక్‌ నిఫ్టి బలహీనంగా ఉండటం. కాబట్టి దిగువ స్థాయిలో నిఫ్టిని కొని స్వల్ప లాభంతో బయటపడండి.

తాజా లెవల్స్‌ కోసం మార్కెట్‌ ఓపెనింగ్‌ రివ్యూ చదవలగలరు.