For Money

Business News

నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. నాస్‌డాక్‌ ఒక్కటే 0.35 శాతం లాభంతో క్లోజ్‌ కాగా, ఇతర సూచీలు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి. కీలక మార్కెట్లయిన చైనా, హాంగ్‌కాంగ్‌,తైవాన్‌, కొరియా మార్కెట్లకు ఇవాళ సెలవు. తెరచి ఉన్న ప్రధాన మార్కెట్లలో జపాన్‌ అర శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి 60 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా స్వల్ప నష్టాలతో లేదా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.