For Money

Business News

నిఫ్టికి ప్రధాన నిరోధం 15050

శుక్రవారం అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. జాబ్‌ డేటా నిస్తేజంగా ఉండటంతో సమీపంలో అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవని రూఢి అయింది. దీంతో షేర్‌ మార్కెట్‌కు మద్దతు పెరిగింది. అయితే ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్‌ మార్కెట్‌ మాత్రం స్పస్టమైన లాభంతోఉంది. ఇతర మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. అయితే లాభనష్టాలు నామ మాత్రంగా ఉన్నాయి. అమెరికా ఆయిల్ సరఫరా కంపెనీపై సైబర్‌ అటాక్‌ జరగడంతో క్రూడ్‌ గ్రీన్‌లో ఉంది.
సింగపూర్ నిఫ్టి 15,000పైన ట్రేడవుతోంది. మిడ్‌ క్యాప్‌ షేర్ల సూచీ నిస్తేజంగా ఉన్నా నిఫ్టి మాత్రం ముందుకు సాగుతోంది. నిఫ్టికివెంటనే 15,050 స్థాయి వద్ద తీవ్ర ప్రతిఘటన ఎదురు కానుంది. నిఫ్టికి ఇప్పటి వరకు 14900 తీవ్ర ప్రతిఘటన స్థాయిగా ఉండేది. ఈ స్థాయిని నిఫ్టి దాటే పక్షంలో 15,050 వద్ద ప్రతిఘన ఎదురు కానుంది. ప్రధాన నిరోధం 14,960పైన నిఫ్టి క్లోజవుతుందేమో చూడాలి. 15,050పైన క్లోజైతేనే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతానికి నిఫ్టికి 14700 వద్ద నిఫ్టికి మద్దతు ఉంది. ఇవాళ్టికి నిఫ్టికి 14960, 15010 వద్ద నిరోధం ఉంటుంది. ఒకవేళ పడితే 14840, 14780 పాయింట్ల వద్ద నిఫ్టికి మద్దతు ఉంటుంది.