For Money

Business News

నిఫ్టికి టెక్‌ కిక్‌?

రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ముఖ్యంగా బాండ్‌ ఈల్డ్స్‌ తగ్గడంతో టెక్‌ షేర్లకు గట్టి మద్దతు లభించింది. డాలర్‌ స్థిరంగా ఉండటంతో ఇతర సూచీలు పెరిగాయి. టెక్‌ షేర్లు ఉండటం వల్ల ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా ఒక శాతం లాభంతో ముగిసింది. డౌజోన్స్‌ అరశాతానికే పరిమితమైంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నాయి. చైనా మార్కెట్లు దాదాపు రెండు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ కూడా అరశాతంపైన లాభంతో ఉంది. భారత మార్కెట్‌ ట్రాక్‌ చేసే హాంగ్‌సెంగ్‌ కూడా ఒక శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్‌ నిఫ్టి 91 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా ఇదే స్థాయి లాభంతో లేదా ఇంకా ఎక్కువ లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఎల్లుండి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కావడంతో ట్రేడింగ్‌ సమయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండటం మంచిది.