For Money

Business News

టెరా లూనా మళ్లీ వచ్చేసింది

ఈ నెల ఆరంభంలో దాదాపు వంద శాతం క్షీణించిన క్రిప్టో కరెన్సీ టెరా యూఎస్‌డీ (TerraUSD ), దాని అనుబంధ క్రిప్టో కాయిన్‌ టెరా లూనా నిన్న మళ్ళీ కోలుకున్నాయి. టెరా యూఎస్‌డీ ధర 20 శాతం పెరగ్గా, టెరా లూనా ధర 18 శాతం పెరిగింది. గత వారాంతంతో పోలిస్తే టెరా లూనా వంద శాతం పెరిగిందని Coin Market Cap పేర్కొంది. స్టేబుల్‌ కాయిన్‌ అయిన టెరా యూఎస్‌డీ, అనుబంధ కాయిన్‌ టెరా లూనా విలువ ఈ వారం ప్రారంభంలో వంద శాతం క్షీణించిన విషయం తెలిసిందే.