For Money

Business News

కావేరీ సీడ్స్‌ షేర్ల బైబ్యాక్‌?

షేర్లను బైబ్యాక్‌ చేయాలని కావేరీ సీడ్స్‌ యోచిస్తున్నట్లు ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మిథున్‌ చంద్‌ తెలిపారు. వచ్చే త్రైమాసికం చివరి నాటికి బైబ్యాక్‌పై కంపెనీ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ప్రాథమికంగా పత్తి విత్తనాలు విక్రయించే కంపెనీ అయినప్పటికీ.. మొక్కజొన్న, వరి, కూరగాయలు, హైబ్రిడ్‌ విత్తనాల విభాగాల్లోకి విస్తరిస్తున్నామని.. 70 శాతం లాభా లు నాన్‌ కాటన్‌ విభాగం నుంచి వస్తున్నాయని చెప్పారు. 2021 మార్చి నాటికి కంపెనీ వద్ద రూ.533 కోట్ల నగదు ఉన్నట్లు చెప్పారు. మార్చితో ముగిసిన ఏడాదిలో ఈ కంపెనీ రూ. 1,036 కోట్ల టర్నోవర్‌పై రూ.311 కోట్ల నికర లాభం ఆర్జంచిన విషయం తెలిసిందే.