For Money

Business News

ఎల్‌ఐసీ ఐపీఓకు సెబి అనుమతి

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఆఫర్‌కు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 13వ తేదీన సెబి వద్ద ఎల్‌ఐసీ ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. ఇంత వేగంగా ఓ పబ్లిక్‌ ఆఫర్‌కు సెబీ అనుమతి లభించడం ఇదే మొదటిసారి. పబ్లిక్‌ ఆఫర్‌ కింద ప్రభుత్వం 31 కోట్ల షేర్లను అమ్ముతుండగా, ఇందులో పది శాతం షేర్లను పాలసీదారులకు కేటాయించారు. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా కనీసం రూ.63,000 కోట్లు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో షేర్‌ ముఖవిలువ రూ.10 కాగా, ఆఫర్‌ ధర ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది. అలాగే మార్కెట్‌లో పరిస్థితి ప్రతికూలంగా ఉన్నందున పబ్లిక్‌ ఆఫర్‌ ఈ నెలలో ఉండదని భావిస్తున్నారు.