ఎన్‌డీటీవీపై సీబీఐ కేసు క్లోజ్
పలు కేసుల్లో మాదిరిగానే ఈ కేసు కూడా క్లోజైంది. అదానీ చేతికి ఎన్‌డీటీవీ వచ్చిన తరవాత ఆ కంపెనీపై నమోదు చేసిన సీబీఐ కేసును క్లోజ్ చేశారు. ఐసీఐసీఐ బ్యాంకుకు ఉద్దేశపూర్వకంగా రూ.48 కోట్లు నష్టం కల్గించారనే ఆరోపణలపై ఎన్‌డీటీవీ, ఆ కంపెనీ ప్రమోటర్లయిన ప్రణయ్ రాయ్, ఆయన భార్య రాధికా రాయ్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇది జరిగింది 2017లో. అయితే ఈ కేసును ఇవాళ సీబీఐ మూసేసినట్లు వార్తలు వస్తున్నాయి. తగిన ఆధారాలు లేనందున కేసును మూసిసనట్లు తెలుస్తోంది. 2009లో ఈ బ్యాంక్ నుంచి ఎన్‌డీటీవీ మాతృసంస్థ ఆర్‌ఆర్‌పీఆర్ హోల్డింగ్స్ ప్రేవేట్ లిమిటెడ్ రుణం తీసుకుంది. ఢిల్లీకి చెందిన సంజయ్ దత్ అనే వ్యక్తి చేసిన ఆరోపణల ఆధారంగా 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. 2022లో ఎన్‌డీటీవీని అదానీ కొనుగోలు చేశారు. దీంతో కంపెనీపై ఇది వరకే నమోదు చేసిన ఒక్కో కేసు వీగిపోతోంది. 2007లో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ 2019లో సీబీఐ మరో కేసు నమోదు అయింది. మరి ఈ కేసు సంగతి ఏమౌతుందో చూడాలి.
