For Money

Business News

ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిన నిఫ్టి

ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా నిన్న నిఫ్టి పెరిగే సరికి..బిజినెస్‌ ఛానల్స్‌లో ఒకటే భజన. మూడీస్‌ రేటింగ్‌ పెరిగిందంటే… ఒకటే కథనాలు. ప్రపంచానికి భారత మార్కెట్ ఓ దుక్సూచి అంటూ ఉన్న విశేషణాలన్నీవాడిన యాంకర్లకు ఇవాళ నిఫ్టి చాలా గట్టి పాఠం నేర్పింది. మిడ్‌ సెషన్‌ వరకు కాస్త హెచ్చుతగ్గులకు లోనైన నిఫ్టి… యూరో మార్కెట్ల దెబ్బకు ఊసురోమంది. ఇవాళ ఉదయం 17884 పాయింట్లకు చేరిన నిఫ్టి… ఒకదశలో 17614కి పడింది. అంటే సరిగ్గా 270 పాయింట్లు క్షీణించిందన్నమాట. క్రితం ముగింపుతో పోలిస్తే 205 పాయింట్ల నష్టంతో 17,617 పాయింట్ల వద్ద ముగిసింది. మిడ్‌ క్యాప్‌ సూచీ ఒకటిన్నర శాతం క్షీణించింది. బ్యాంక్‌ నిఫ్టి 0.7 శాతం నష్టపోయింది. యూరో మార్కెట్లలో మాత్రం భారీ అమ్మకాలు కొనసాగుతున్నాయి.