For Money

Business News

అమ్మకానికి మరో ప్రభుత్వ కంపెనీ

ప్రభుత్వ రంగానికి చెందిన పలు ఆణిముత్యాలను ప్రైవేటీకరించిన మోడీ ప్రభుత్వం తాజాగా షిప్పింగ్‌ కార్పొరేషన్‌పై పడింది. ఈ కంపెనీలో వాటాలను అమ్మేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ
ఈ ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.24,400 కోట్లు సర్కార్‌ సమకూర్చుకుంది.ఈ షేర్లు కొన్ని ఇన్వెస్టర్లు మాత్రం నష్టాలపాలయ్యారు. స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పరుగులు పెడుతున్నా…ఈ షేర్‌ ఓ మూలన పడి ఉంది. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. తాజా షిప్పింగ్‌ కార్పొరేషన్‌లో వాటాల విక్రయానికి ముందు ఆ కంపెనీకి చెందిన భూములు, అప్రధాన ఆస్తులను ‘ఎస్‌సీఐ ల్యాండ్‌ అండ్‌ అసెట్స్‌ లిమిటెడ్‌’కు బదలాయిస్తోంది. మరో మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఇలా అన్ని విధానాలుగా లాభదాయకమైన కంపెనీగా మార్చి… ప్రభుత్వం విక్రయిస్తుందన్నమాట. నిజానికి మార్చి 2020లోనే షిప్పింగ్‌ కార్పొరేషన్‌లో తనకు ఉన్న 63.75 శాతం వాటాల విక్రయానికి ప్రభుత్వం ప్రాథమిక బిడ్లను ఆహ్వానించింది. ఆస్తుల బదలాయింపు ప్రక్రియ ఆలస్యం కావడంతో ప్రైవేటీకరణలో జాప్యం జరుగుతోంది.