లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో మన మార్కెట్లు గ్రీన్‌లో ప్రారంభం కానున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ గ్రీన్‌లో క్లోజవగా, ఎస్ అండ్ పీ 500 స్వల్ప నష్టంతో ముగిశాయి. అయితే నాస్డాక్ 0.7 శాతంతో క్లోజైంది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు దాదాపు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా చైనా, నిక్కీ, తైవాన్ దాదాపు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ స్వల్ప నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా స్థిరంగా లేదా ఒక మోస్తరు లాభంతో ప్రారంభం కావొచ్చు. విప్రో ఫలితాల ప్రభావం మిడ్ క్యాప్ ఐటీ షేర్లలో అధికంగా ఉండే అవకాశముంది.
