3 కంపెనీల్లో జుమాటొ పెట్టుబడి
సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో కంపెనీ టర్నోవర్ రూ. 1024 కోట్లకు చేరింది. గత ఏడాది సమయంలో కంపెనీ టర్నోవర్ రూ.426 కోట్లు మాత్రమే. అయితే ఇదే సమయంలో కంపెనీ నికర నష్టం మాత్రం రూ.229 కోట్ల నుంచి రూ. 434 కోట్లకు పెరిగింది. ఇతర సంస్థల టేకోవర్, అడ్వర్టయిజ్మెంట్, మార్కటింగ్ వంటి ఖర్చులు పెరగడంతో నష్టాలు పెరిగాయని కంపెనీ పేర్కొంది. రానున్న కొన్ని ఏళ్ళలో 100 కోట్ల డాలర్లను ఇతర స్టార్టప్‌లలో పెట్టాలని భావిస్తున్నట్లు జొమాటో తెలిపింది. లాజిస్టిక్ అగ్రిగేటర్ షిప్ రాకెట్, లోకల్ షాపింగ్ కయాప్ మాజిక్పిన్తో పాటు కల్ట్‌ఫిట్ (పాత పేరు క్యూర్‌ఫిట్) భారీ పెట్టుబడి పెడుతున్నట్లు జొమాటో ప్రకటించింది. గత ఆరు నెలల్లో ఈ కంపెనీల్లో రూ. 27.5 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది.