For Money

Business News

కిమ్స్‌ హాస్పిటల్స్‌ లాభం రూ.84 కోట్లు

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) రూ.417 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.84 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.411 కోట్ల ఆదాయంపై రూ.90 కోట్ల నికరలాభం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి కిమ్స్‌ హాస్పిటల్స్‌ రూ.894 కోట్ల మొత్తం ఆదాయాన్ని, రూ.176 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. సెప్టెంబరు త్రైమాసికంలో ‘కొవిడ్‌’ కేసులు తగ్గినా, ఇతర చికిత్సలు, శస్త్రచికిత్సలు పెరిగినట్లు కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఎండీ డాక్టర్‌ బి.భాస్కరరావు పేర్కొన్నారు. గుండె, ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి చేరుకున్నట్లు వెల్లడించారు.