For Money

Business News

31 ఏళ్ళ స్థాయికి అమెరికా ద్రవ్యోల్బణం

పెట్రోల్‌, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం 31 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. అక్టోబర్‌ నెలలో రీటైల్‌ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరింది. సెప్టెంబర్‌లో 5.4 శాతం ఉన్న ద్రవ్యోల్బణం కేవలం ఒక నెలలోనే భారీగా పెరిగింది. డ్రైవర్‌ వంటి పలు పనులకు ఉద్యోగులు దొరకడం లేదు. దీంతో పోటీపడి జీతాలు పెంచుతున్నారు. 1990 సెప్టెంబర్‌లో అమెరికా రీటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉండేది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అంతే ద్రవ్యోల్బణం నమోదైంది. కాని అక్టోబర్‌లో 6.2 శాతానికి చేరింది. గత 31 ఏళ్ళలో ఇదే రికార్డు. ద్రవ్యోల్బణ డేటా విడుదల మరుక్షణం డాలర్‌ పరుగులు తీసింది. డాలర్‌ ఇండెక్స్‌ ఇపుడు 0.6 శాతం పెరిగి 94.47 వద్ద ట్రేడవుతోంది.