For Money

Business News

10 శాతంపైగా డౌన్‌

జొమాటొ షేర్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ షేర్‌ గత ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ షేర్‌ గత ఏడాది నవంబర్‌ 16వ తేదీన రూ.169లకు చేరింది. అక్కడి నుంచి పడుతూ వచ్చింది. ఇవాళ ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి రూ. 47.50ని తాకింది. ఇవాళ ఒక్క రోజేఏ ఈ షేర్‌ 11 శాతం వరకు క్షీణించింది. దీనికి ప్రధాన కారణంగా ఇవాళ్టితో ఈ కంపెనీ షేర్‌లో ఉన్న ఏడాది లాక్‌ ఇన్‌ పీరియడ్‌ అయిపోయింది. అంటే ప్రి పబ్లిక్‌ ఇష్యూ ముందు షేర్లను కొన్నవారు ఇవాళ్టి నుంచి అమ్ముకోవచ్చు. దీంతో ఈ షేర్‌పై భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇప్పటికే ఈ కౌంటర్‌లో 5 కోట్లకుపైగా షేర్లు ట్రేడయ్యాయి.