14 శాతం పెరిగిన షేర్.. ఇపుడు కొనొచ్చా?
గత కొన్ని రోజులుగా ఎస్ బ్యాంక్ వరుసగా పెరుగుతూనే వస్తోంది. ఇవాళ ఏకంగా 14 శాతం పెరిగి రూ, 24.15 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్లో వచ్చే ఏడాది మార్చి నెలలో లాకిన్ పీరియడ్ పూర్తి కానుంది. కొన్నికోట్ల షేర్లు అమ్మకానికి వస్తాయి. కాబట్టి ఇపుడు టెక్నికల్ ట్రేడింగ్ జరుగుతోందని అనలిస్టలు అంటున్నారు. ఈ షేర్ 200 చలన సగటు రూ. 40లని.. ఇదే దాటే వరకు ఈ షేర్ గట్టిగా నిలబడుతుందా లేదా చెప్పలేమని టెక్నికల్ అనలిస్ట్ మానస్ జైశ్వాల్ సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్‌తో అన్నారు. ప్రస్తుతం రూ.21 స్టాప్‌తో ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని… ఈ షేర్ రూ. 32 దాకా వెళ్ళే అవకాశముందని ఆయన అన్నారు. ఈ స్థాయిలో కొన్నవారు షేర్ పెరిగినపుడల్లా తమ స్టాప్‌లాస్‌ను పెంచుకుంటూ పోవాలని అన్నారు. రూ.32 దాటిన తరవాత మళ్ళీ షేర్ పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుందని అన్నారు.