For Money

Business News

కేజ్రీవాల్‌ నిర్ణయంతో ఆ షేర్లలో ఒత్తిడి

జవనరి 1వ తేదీ నుంచి ఢిల్లీ ప్రజలకు 450 రకాల మెడికల్ టెస్ట్‌లను ఉచితంగా అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రకటించడంతో ఢిల్లీ కేంద్రంగా ఉన్న హెల్త్‌కేర్‌ ల్యాబ్‌ షేర్లు తగ్గాయి. అలాగే హాస్పిటల్స్‌ షేర్లు కూడా. ముఖ్యంగా ఇవాళ డాక్టర్‌ పత్‌ ల్యాబ్‌ షేర్‌ అయిదు శాతం క్షీణించింది. కేజ్రివాల్‌ నిర్ణయంతో ల్యాబ్‌ కంపెనీల టర్నోవర్‌తో పాటు లాభదాయకత కూడా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డాక్టర్‌పత్‌ ల్యాబ్స్‌ షేర్‌ 5 శాతం క్షీణించి రూ. 2324కు పడిపోయింది. ఇపుడు కూడా రూ. 71 నష్టంతో అంటే 3 శాతం క్షీణించి రూ. 2355 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు కేజ్రివాల్ నిర్ణయం ప్రభావం అపోలో హాస్పిటల్స్‌పై కూడా ఉంటుందా అన్నది తెలియదు. కాని షేర్‌ ఇవాళ 1.25 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇతర టెస్టింగ్‌ ల్యాబ్ కంపెనీలు ఉన్నా… వాటికి ఢిల్లీలో పెద్ద శాఖలు లేనందున… ఆ షేర్లపై పెద్ద ప్రభావం పడలేదు. విజయ డయాగ్నస్టిక్‌ ల్యాబ్ ఒక శాతం లాభంతో ట్రేడవుతోంది.