ఆర్థిక సేవలకు షియోమీ గుడ్‌బై
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్‌లో యాప్ ద్వారా అందిస్తున్న ఆర్థిక సేవలను నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఎంఐ పే, ఎంఐ క్రెడిట్ యాప్స్‌లను ప్లే స్టోర్, కంపెనీకి చెందిన యాప్ స్టోర్ నుంచి తొలగించిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. బిల్ పేమెంట్లు, నగదు బదిలీ సేవలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) నుంచి ఎంఐ పే యాప్ గుర్తింపు పొందింది. అయితే ఈ అంశంపై షియోమీ మాత్రం అధికారికంగా స్పందించలేదు. పన్ను ఎగవేతకు సంబంధించి భారత్‌లో ఈ కంపెనీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.