For Money

Business News

అంచనాలను మించిన పనితీరు

జూలై-సెప్టెంబర్‌ మధ్యకాలంలో మారుతీ సుజుకీ కంపెనీ రూ.2,112 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.486.9 కోట్లతో పోలిస్తే నికర లాభం నాలుగు రెట్లు పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అలాగే అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. ఏడాది క్రితం రెండో త్రైమాసికంలో రూ.20,550. 9 కోట్లుగా ఉన్న సంస్థ టర్నోవర్‌ గత త్రైమాసికంలో రూ.29,942.5 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈటీనౌ ఛానల్‌ నిర్వహించిన సర్వేలో కంపెనీ రూ. 29,931 కోట్ల అమ్మకాలపై రూ. 1935 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని అంచనా వేశారు. మార్కెట్‌ అంచనాలను కంపెనీ దాటిందన్నమాట. గత త్రైమాసికంలో సంస్థ 5,17,395 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో వాహనాలను విక్రయించడం ఇదే తొలిసారి. వీటిలో దేశీయంగా 4,54,200 యూనిట్లు అమ్మగా, 63,195 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.చిప్‌ల కొరతతో మరో 35 వేల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయింది. ఇంకా కంపెనీ వద్ద 4.12 లక్షల వాహనాలకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొత్త వాహనాలకు సంబంధించిన ఆర్డర్లు 1.30 లక్షలని మారుతీ పేర్కొంది.