33 ఏళ్ళ గరిష్ఠానికి టోకు ధరలు
దేశంలో టోకు ధరల సూచీ (whole sale price index) 33 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. మరికొందరు దీన్ని ఆల్ టైమ్ హైగా పేర్కొంటున్నారు. అక్టోబర్లో 12.5 శాతం ఉన్న టోకు ధరల సూచీ నవంబర్ నెలలో 14.2 శాతానికి చేరింది. 1988 తరవాత ఈ స్థాయికి ఈ సూచీ రావడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు గణనీయంగా పెరగడడమే దీనికి ప్రధాన కారణం. వినియోగ వస్తువుల ధరల సూచీ కూడా నిన్న పెరిగింది. అయితే అంచనాలకు అనుగుణంగా ఉందని భావించారు. అయితే ఇవాళ వచ్చిన టోకు ధరల సూచీ మాత్రం ఆర్థిక వేత్తల అంచనాలను దాటింది. పరిస్థితి చూస్తుంటే ధరలు భారీగా పెరుగుతున్నాయని… దీంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని బ్యాంకర్లు అంటున్నారు. క్రూడ్ ధరలు అధికంగా ఉన్నందున… అనేక వస్తువుల ధరలు మునుపెన్నడూ లేని గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి.