For Money

Business News

కోలుకున్నా… నష్టాల్లో ముగిసిన నిఫ్టి

ఇవాళ నిఫ్టి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. డే ట్రేడర్లకు మంచి ఛాన్స్‌ ఇచ్చింది. ఓపెనింగ్‌లో… పడిన వెంటనే కోలుకున్న నిఫ్టి ఆ తరవాత భారీగా పతనమైంది. ఒకదశలో 17,225కు చేరింది.కాని యూరో ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండేసరికి… మిడ్‌ సెషన్‌ కల్లా గ్రీన్‌లోకి వచ్చేసింది. కాని యూరో షేర్ల లాభాలు ఎంతో సేపు నిలబడలేదు. పైగా అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లో ఉండేసరికి… నిఫ్టిపై మళ్ళీ ఒత్తిడి వచ్చింది. మళ్ళీ 17,250కి పడింది. క్లోజింగ్‌లో స్వల్ప షార్ట్‌ కవరింగ్‌తో 17,324 వద్ద ముగిసింది.క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 43 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడేలో డే ట్రేడర్లకు 150 పాయింట్ల పతనం, 150 పాయింట్ల రికవరీ అందివచ్చింది. పూర్తిగా ఆల్గో లెవల్స్‌కు ఇవాళ నిఫ్టి పరిమితమైంది. 200 రోజుల చలన సగటు 17,260పైన నిఫ్టి క్లోజ్‌ కావడం బుల్స్‌కు కాస్త ఊరట ఇచ్చే అంశం. కాని సూచీలు ఒక మోస్తరుగా కోలుకున్నా… అంతర్లీనంగా భారీ అమ్మకాల ఒత్తిడి ఉందనే అంశాన్ని మిడ్‌ క్యాప్ నిఫ్టి చెబుతోంది. ఈ నిఫ్టి 0.4 శాతం నష్టపోవడమే ఉదాహరణ. బ్యాంక్ నిఫ్టి దాదాపు స్థిరంగా క్లోజ్‌ కాగా, నిఫ్టి నెక్ట్స్‌ 0.33 శాతం లాభంతో ముగిసింది. ఐటీసీ ఇవాళ మూడు శాతం నష్టంతో క్లోజ్‌ కావడం విశేషం.