For Money

Business News

నష్టాల్లో మార్కెట్లు…SGX Nifty కూడా

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను వణికిస్తున్నాయి. ఇవాళ జరిగే నాటో దేశాల కూటమి సమావేశ నిర్ణయాల కోసం మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. తమ నుంచి ఆయిల్‌ కొనుగోలు చేసినవారు రూబల్స్‌లో చెల్లింపులు చేయాలని రష్యా వెల్లడించడంతో ఆ కరెన్సీ రాత్రి పది శాతం పెరిగింది. మరోవైపు క్రూడ్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో బ్రెంట్ క్రూడ్‌123, WTI క్రూడ్‌ 116 డాలర్లపైన ట్రేడవుతున్నాయి. క్రూడ్‌తో పాటు అనేక మెటల్స్‌ ధరలు గణనీయంగా పెరగడంతో కంపెనీలు తమ మార్జిన్స్‌ తగ్గుతాయని ఆందోళన చెందుతున్నాయి. రాత్రి వాల్‌స్ట్రీట్‌లో డౌజోన్స్‌ 1.29 శాతం క్షీణించడానికి ఇదే కారణం.ఆరంభంలో గ్రీన్‌లో ఉన్న నాస్‌డాక్‌ 1.32 శాతం నష్టపోగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా ఇదే స్థాయి నష్టాలతో ముగిసింది. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా ఒక శాతం నష్టపోయాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో అదే ట్రెండ్‌ కొనసాగుతోంది. అన్ని మార్కెట్లు రెడ్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. ఇక హాంగ్‌సెంగ్‌ కేవలం 0.31 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక చైనా మార్కెట్లు కూడా ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో నిఫ్టి నష్టాలతో ప్రారంభం కావడం ఖాయంగా కన్పిస్తోంది.