For Money

Business News

వృద్ధి రేటులో కోత

భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత్‌ ఆర్థికాభివృద్ధిని 8.7 శాతంగా గతంలో అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్‌ ఇపుడు ఆ వృద్ధి రేటును 7.5 శాతానికి తగ్గించింది. వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్‌ కట్‌ చేయడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.7 శాతం వృద్ధి రేటును అంచనా వేసిన బ్యాంక్‌ ఏప్రిల్‌ నెలలో 8 శాతానికి దించింది. ప్రస్తుతం దీనిని 7.5 శాతానికి తగ్గించింది. 2023-24 నుంచి వృద్ధి మరింతగా తగ్గి 7.1 శాతానికి చేరుతుందని ప్రపంచ బ్యాంక్‌ గ్లోబల్‌ ఎకనామిక్‌ ప్రాస్పెక్ట్స్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. ప్రైవేట్‌ రంగం నుంచి వస్తున్న స్థిర పెట్టుబడులు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు, ప్రోత్సాహకాలు దీర్ఘకాలిక వృద్ధికి దోహదపడతాయని పేర్కొంది.