For Money

Business News

NIFTY TRADE: ఇవాళ మద్దతు లభిస్తుందా?

చాలా ఆసియా మార్కెట్లు మూత పడ్డాయి. చైనా మార్కెట్‌లో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. హాంగ్సెంగ్‌ 3 శాతం నష్టంతో ట్రేడ్‌ కావడానికి కారణం ఇదే. మరోవైపు అమెరికాలో డాలర్‌ పెరుగుతోంది. బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతున్నాయి. ఇన్వెస్టర్లు క్రమంగా షేర్ల నుంచి వైదొలగుతున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ భారీ నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది. నిఫ్టి క్రితం ముగింపు 17585. సింగపూర్ నిఫ్టి ప్రకారమైతే నిఫ్టి 17,435 ప్రాంతంలో ఓపెన్‌ కావాలి. శుక్రవారం అమెరికా మార్కెట్లు ఒక శాతం క్షీణించాయి. ఫ్యూచర్స్‌ కూడా రెడ్‌లో ఉన్నాయి. సో… నిఫ్టిపై ఇవాళ ఒత్తిడి అధికంగా ఉండే అవకాశముంది. నిఫ్టి ఓపెనింగ్‌ 17,470-17,430 మధ్య కదలాడే అవకాశముంది. నిఫ్టి గనుకు 17,430 దిగువకు వెళితే మాత్రం 17,385, 17360 లెవల్స్‌ గమనించండి. మరి దిగువస్థాయిలో నిఫ్టికి మద్దతు లభిస్తుందా? గురువారం వరకు నిఫ్టిలో అనిశ్చితి కొనసాగనుంది.