For Money

Business News

గోల్డ్‌… ఇంకా ఎంత వరకు పడుతుంది?

అమెరికాలో గత శుక్రవారం రీటైల్స్‌ సేల్స్‌ గణాంకాలు వచ్చాయి. జనం భారీగానే కొంటున్నారు. సో.. జనం దగ్గర బాగానే డబ్బు ఉంది. కాబట్టి ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు తగ్గించాలని అమెరికా కేంద్ర బ్యాంక్‌ నిర్ణయించే అవకాశాలు బలపడుతున్నాయి. మంగళ, బుధవారాల్లో అమెరికా కేంద్రం బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం కానుంది. ఈలోగా వస్తున్న డేటా కారణంగా డాలర్‌ బలపడుతోంది. ఆటోమేటిగ్గా బంగారం క్షీణిస్తోంది. దేశీయ మార్కెట్లలో బంగారం ధరలను మీరు లెక్కించాలంటే… అమెరికాలో డాలర్‌, బులియన్‌ ధరలను బాగా గమనించాలి. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం ధర 1747 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారానికి టెక్నికల్‌గా 1757 డాలర్లు చాలా కీలకం. ఈ స్థాయి కన్నా దిగువకు పడిందంటే.. 1738 డాలర్లకు తగ్గనుంది. అక్కడి నుంచి 1716 డాలర్లకు పడే అవకాశం ఈ వారంలోనే రావొచ్చు. సో… స్వల్ప కాలానికి బంగారం కొనాలనుకునే వారు ఔన్స్‌ బంగారం ధర 1716 డాలర్లకు వస్తుందేమో చూడండి. వస్తే కూడా సగం పెట్టుబడి మాత్రమే పెట్టండి. డాలర్‌ ఇంకా పెరిగితే బంగారం 1678 డాలర్లకు కూడా పడొచ్చు. గత ఆగస్టులో బంగారం ఈ స్థాయికి చేరాక… కోలుకుంది. అదే సీన్‌ రిపీట్‌ అవుతుందేమో చూడండి. బంగారం కొనేవారికి ఇది మంచి అవకాశం. 1716 డాలర్లు లేదా 1678 డాలర్లు. ఈ రెండు స్థాయిల వద్ద పెట్టుబడి పెట్టే అంశాన్ని పరిశీలించండి. మన మార్కెట్‌లో బంగారం ధరలను పరిశీలించడం కన్నా.. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు చూసి కొనండి.