దిగువన నిఫ్టికి సపోర్ట్ అందేనా?
ఉదయం గరిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి వంద పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 18077 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి మిడ్ క్యాప్ తప్ప మిగిలిన సూచీలు రెడ్లో ఉన్నాయి. నామ మాత్రపు నష్టాలే. యూరో మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్ స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన బ్రోకర్లు, విదేశీ ఇన్వెస్టర్లు ఏం చేస్తారనేది కీలకం. ఇవాళ చివరి గంట ట్రేడింగ్ చూసి పొజిషన్స్ తీసుకోవచ్చు. చిన్న ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్కు దూరంగా ఉండటం మంచిది. ఫలితాలు, షేర్లలో ట్రేడ్ చేసుకోవచ్చు. నిఫ్టికి ఇవాళ దూరంగా ఉండటమే బెటర్. రేపు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది. చాలా హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఇక షేర్ల విషయానికొస్తే కొత్తగా మెరుపులు లేవు. ఉదయం ట్రెండ్ అలాగే కొనసాగుతోంది. దిగువస్థాయిలో నిఫ్టికి మద్దతు లభిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఫలితాలను మార్కెట్ డిస్కౌంట్ చేస్తోంది. అనూహ్య ఫలితాలు ఉంటే తప్ప… మంచి ఫలితాలు వచ్చినా… అధిక స్థాయిలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు.