స్థిరంగా ఉన్నా… పతనమే తరువాయి
యూరో మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి.ఉదయం నుంచి 150 పాయింట్ల వ్యత్యాసంతో నిఫ్టి కదలాడుతోంది. ఉదయం ఆకర్షణీయ లాభాల్లోకి వెళ్ళిన నిఫ్టి మిడ్ సెషన్ కల్లా నష్టాల్లోకి జారుకుంది. 15734 పాయింట్లకు చేరిన నిఫ్టి ఇపుడు 15826 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దాదాపు 27 పాయింట్లు లాభంలో ఉన్న నిఫ్టి .. ఇదే స్థాయిలో కొనసాగుతుందా అన్న అనుమానం కల్గుతోంది. ఎందుకంటే యూరో మార్కెట్లు రెండు శాతం పైగా నష్టపోగా, అమెరికా ఫ్యూచర్స్ ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. 15800 స్థాయిలో భారీ కాల్ రైటింగ్‌కు జరుగుతోంది. ఇవాళ నెలవారీ, వారపు డెరివేటివ్స్ క్లోజ్ అవుతున్నందున..నిఫ్టి అధిక స్థాయిలో ఉన్నా… ఈ స్థాయి నుంచి భారీగా నష్టపోవడం ఖాయమని అనలిస్టులు అంటున్నారు. మరి ఆ పతనం ఇవాళే ఉంటుందా.. లేదా రేపటికి వాయిదా పడుతుందా అన్నది చూడాలి. ఈ వారం మార్కెట్లో వచ్చిన ర్యాలీతో షార్ట్ కవరింగ్ పూర్తయిందని… ఇవాళే చివర్లో నిఫ్టి పడుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు.