కొత్త జనరేషన్ షేర్స్… వీటిని కొనొచ్చా?
మార్కెట్ దిగువ స్థాయి నుంచి కోలుకుంటోంది. నిఫ్టి 17000 ప్రాంతానికి చేరుకునేందుకు రెడీ అవుతోంది. మరోవైపు కొత్త జనరేషన్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. జొమాటొ, పీబీ ఫిన్టెక్, నైకా, పే టీఎం, కార్ ట్రేడ్ వంటి షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఈ అమ్మకాల హోరులో కొత్త జనరేషన్ షేర్లను కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని స్టాక్ అనలిస్టులు సూచిస్తున్నారు. చక్కటి ఫలితాలు ప్రకటించిన బర్జర్ కింగ్ షేర్ రూ 170 టార్గెట్తో కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే జొమాటో కూడా ఇక్కడి నుంచి స్వల్ప పరిమాణంలో కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. ఒకేసారి కాకుండా పడినపుడల్లా కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. పేటీఎం విషయంలో మాత్రం ఇంకా ఆగాల్సి ఉందని అంటున్నారు. అలాగే నైకా షేర్లు కూడా తక్కువ పరిణామంలో కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు. అన్నింటికన్నా జూబ్లియంట్ ఫుడ్ షేర్ మంచి ప్రతిఫలాలను ఇస్తుందని అంటున్నారు.