For Money

Business News

పెరిగేదే లే… 16900 దిగువన నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు భారీగా కోలుకున్నా… ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సింగపూర్ నిఫ్టి కేవలం 50 పాయింట్ల నష్టంతో ఉండేసరికి… నిఫ్టి లాభాల్లోకి వస్తుందని చాలా మంది ఆశించారు. కాని ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16900 దిగువకు చేరింది. 16,855 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16857 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 291 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 43 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టికంటే మిడ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉంది. అలాగే నిఫ్టి నెక్ట్స్‌. ఈ రెండు సూచీలు రెండు శాతం వరకు నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి కూడా ఒక శాతంపైగా నష్టంతో ఉంది. నిఫ్టిలో ఏషియన్‌ పెయింట్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. మిడ్‌ క్యాప్‌లో కేవలం ఐడియా ఒక్కటే గ్రీన్‌లో ఉంది.