For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ జోరు?

ఇటీవల బ్యాంకింగ్‌ షేర్లలో పెరగడంలోనూ పతనంలోనూ సంచలనం సృష్టించిన హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ (HDFC Bank, HDFC) మళ్ళీ వెలుగులో ఉన్నాయి. రూ. 1750 నుంచి 1350కి పడిన HDFC Bank నిన్న స్థిరంగా ముగిసింది. రాత్రి ఈ బ్యాంక్‌ ఏడీఆర్‌ అమెరికా మార్కెట్‌లో రెండు శాతంపైగా పెరిగింది.దీంతో ఇవాళ ఈ షేర్‌లో కాస్త మద్దతు కన్పించవచ్చు. పైగ వీక్లీ డెరివేటివ్స్‌ కావడంతో షార్ట్‌ కవరింగ్‌ వస్తుందేమో చూడాలి. ఇక హెచ్‌డీఎఫ్‌సీ నిన్న రెండు శాతం పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్‌లో 10 శాతం వాటాను అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA) కొనుగోలు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్‌ వంద శాతం హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థ. ఈ డీల్‌ విలువ రూ.184 కోట్లు. ఈ డీల్‌ కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌లో ఇవాళ కూడా ఉత్సాహం కొనసాగుతుందేమో చూడాలి.