For Money

Business News

NIFTY TODAY: పడితే కొనండి

నిన్న నిఫ్టి కాస్త పటిష్ఠంగానే ముగిసింది. ప్రపంచ మార్కెట్లు స్థిరంగా ఉన్నాయనే చెప్పాలి. రాత్రి నాస్‌డాక్‌ భారీగా క్షీణించినా… ఇది చాలా వరకు నెట్‌ఫ్లిక్స్‌, ఫేస్‌బుక్‌ షేర్ల పతనం కారణంగానే. ఇతర షేర్లు స్థిరంగా ఉన్నాయి. ఇక ఆసియా మిశ్రమంగా ఉంది.అయినా పెద్దగా ఆందోళన కల్గించే పరిణామాలు లేవు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. నిఫ్టి నిన్న 17136 వద్ద ముగిసింది. ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టికి 17094 కీలకం. ఈ స్థాయి పైనే ఉండే పక్షంలో నిఫ్టి 17,217ని తాకే అవకాశముంది. సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నిఫ్టి ఓపెనైతే … ఆరంభంలోనే నిఫ్టి 17217ని దాటొచ్చు. రిలయన్స్‌తో సహా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు ఆకర్షణీయంగా ఉండొచ్చు. ఇవాళ్టి ట్రేడింగ్‌కు నిఫ్టి లెవల్స్‌ ఇవి…

అప్‌ బ్రేకౌట్‌ 17280
రెండో ప్రతిఘటన 17242
తొలి ప్రతిఘటన 17217
నిఫ్టికి కీలకం 17094
తొలి మద్దతు 17056
రెండో మద్దతు 17031
డౌన్‌ బ్రేకౌట్‌ 16993