దివీస్ పెరిగేనా?

క్యూ4లో దివీస్ లేబొరేటరీస్ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో ఇవాళ ఆ షేర్ కదలికలపై ఆసక్తి నెలకొంది. ఈ షేర్ ఇప్పటికే రూ. 3800 నుంచి రూ. 6000 ప్రాంతానికి పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. ఈ షేర్ ఇక నుంచి ఎంత వరకు పెరుగుతుందనే అంశం వివిధ బ్రోకరేజీ సంస్థల విశ్లేషణలకు ఇపుడు ప్రాధాన్యం ఏర్పడింది.
గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో దివీస్ లేబొరేటరీస్ రూ.2,671 కోట్ల ఆదాయంపై రూ.662 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 23 శాతం, ఆదాయం 12 శాతం వృద్ధి చెందింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ.9,712 కోట్ల ఆదాయంపై రూ.2,191 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ప్రతి షేరుకు రూ.30 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.