ఎల్ఐసీ విలువ ఎందుకు తగ్గించారు?
రేపటి నుంచి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుంది. స్టాక్ మార్కెట్ ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నా ఈ పబ్లిక్ ఆఫర్ ప్రారంభ సమయంంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తింది. ఎల్ఐసీ షేర్లను కారు చౌకగా ఎందుకు అమ్ముతున్నారని నిలదీసింది. ఇదే ఏడాది ఫిబ్రవరి నెలలో ఎల్ఐసీ విలువ రూ. 12 లక్షల కోట్ల నుంచి రూ. 14 లక్షల కోట్ల వరకు ఉంటుందని కేంద్రం చెప్పిన విషయాన్ని పేర్కొంది. కేవలం రెండు నెలల్లో ఎల్ఐసీ విలువను రూ. 6 లక్షల కోట్లకు అంటే సగానికి ఎలా తగ్గించారని నిలదీసింది. స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉన్నందున ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ను ఆపేస్తున్నామని డిజిన్వెస్ట్మెంట్ ఇంచార్జి సెక్రటరీ చెప్పిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేసింది. మాట మార్చి ఇపుడు ఎందుకు పబ్లిక్ ఇష్యూకు తెస్తున్నారని ప్రశ్నించింది.