మరింత తగ్గిన బులియన్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు క్షీణిస్తూనే ఉన్నాయి. అమెరికా మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1800 డాలర్ల దిగువకు వచ్చిన విషయం తెలిసిందే. రాత్రి కూడా 1790 డాలర్ల వద్ద ముగిసింది. అయితే డాలర్ మరింత పెరగడంతో మనదేశంలో బులియన్ ధరలు తగ్గుదల కాస్త తక్కువగా ఉంది. ఫ్యూచర్స్ మార్కెట్లో రాత్రి ఎంసీఎక్స్‌లో బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ రూ.232 తగ్గి రూ.47,678 వద్ద ట్రేడవుతోంది. ఇది స్టాండర్ బంగారం పది గ్రాముల ధర. ఇక వెండి విషయానికొస్తే… రూ.826 క్షీణించి రూ.61,398 వద్ద ట్రేడవుతోంది.
మన స్పాట్ మార్కెట్లో…
దేశ రాజధాని హైదరాబాద్‌లో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 చొప్పున తగ్గాయి. దీంతో పసిడి రేటు వరుసగా రూ.49,250కు, రూ.45,150కు దిగివచ్చాయి. వెండి ధర కూడా తగ్గాయి. కేజీ వెండి రేటు రూ.1200 తగ్గి రూ.62,000కు చేరింది.
ఇక విశాఖపట్నంలో బంగారం ధర వెలవెలబోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.390 పడిపోయింది. దీంతో బంగారం ధర రూ. 49,250కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఈ పసిడి రేటు రూ.350 తగ్గుదలతో రూ. 45,150కు క్షీణించింది. వెండి రేటు కూడా రూ.1400 తగ్గి రూ.66,300కు క్షీణించింది.