వాల్‌స్ట్రీట్…మళ్ళీ నష్టాల్లోకి
ఇవాళ అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి యూరో మార్కెట్లు గ్రీన్‌లోకి వచ్చేశాయి.దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. దీంతో అమెరికా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. కాని లాభాలు నిలబడలేదు. మిడ్‌సెషన్‌కు ముందే సూచీలన్నీ నష్టాల్లోకి వచ్చేశాయి. అన్నింటికన్నా భిన్నంగా ఇవాళ డౌజోన్స్ 0.7 శాతంపైగా నష్టపోవడం విశేషం. నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 0.6 శాతం నష్టంతో ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య సీరియల్లా కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం తనకు అనుకూలంగా ఉన్న ఉక్రెయిన్‌కు చెందిన ప్రావెన్సిలకు రష్యా దళాలు పంపడంతో మార్కెట్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతానికి మార్కెట్ భయంతోనే నడుస్తోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ స్వల్పంగా క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 96 దిగువకు వచ్చేసింది.