స్థిరంగా వాల్‌స్ట్రీట్
ఫెడ్ నిర్ణయం తరవాత పరుగులు తీసిన వాల్‌స్ట్రీట్ ఇవాళ కాస్త సేద తీరుతోంది. సూచీలు ఒక మోస్తరు లాభాలకే పరిమితం అయ్యాయి. నిజానికి నష్టాల్లో ఉన్న డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు ఇపుడిపుడే గ్రీన్‌లోకి వచ్చాయి. నాస్డాక్ మాత్రం 0.4 శాతం లాభంతో ట్రేడవుతోంది. చాలా రోజుల తరవాత డాలర్ స్వల్పంగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ నిన్న 102 దిగువకు పడిన విషయం తెలిసింది. ఇవాళ కాస్త తేరుకుంది. క్రూడ్ మార్కెట్ కూడా స్థిరంగా ఉంది. ఈ వారంలో 72 డాలర్లకు పడిపోయిన బ్రెంట్ క్రూడ్ ధర ఇవాళ 76 డాలర్లను దాటింది. ఇక బులియన్ మార్కెట్లో మిశ్రమ ధోరణి కన్పిస్తోంది. బంగారం లాభాల్లో ఉండగా, వెండి నష్టాల్లో ట్రేడవుతోంది. ఔన్స్ బంగారం ధర 2050 డాలర్ల స్థాయిని అధిగమించే అవకాశాలు కన్పిస్తున్నాయి.