For Money

Business News

ఎకానమీ షేర్ల అండ

చాలా రోజుల తరవాత వాల్‌స్ట్రీట్‌కు ఎకానమీ షేర్లు అండగా నిలుస్తున్నాయి. మొన్నటి దాకా నాస్‌డాక్‌ కేంద్రంగా సాగిన ట్రేడింగ్‌ ఇపుడు డౌజోన్స్‌కు డైవర్ట్‌ అయినట్లుంది. ఇవాళ కూడా డౌజోన్స్‌ 0.65 శాతం లాభంతో ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ ఇపుడు 0.18 శాతం లాభంతో ఉంది. నిన్న పాతిక శాతం పడిన మోడెర్నా షేర్‌ ఇవాళ 15 శాతం పైగా లాభంతో ఉంది. ఇక టెస్లా షేర్‌ ఇవాళ 4 శాతం దాకా లాభపడగా, చిప్‌ షేర్లు స్థిరంగా ఉన్నాయి. ఇరాన్‌, అమెరికా మధ్య ఇంకా టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. ఇరు పక్షాలు తమ వాదనలకు కట్టుబడి ఉన్నాయి. దీంతో క్రూడ్‌ 94 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌ కూడా స్థిరంగా ఉండటంతో డాలర్‌ ఇండెక్స్‌ 99లోపే ఉంటోంది. ఇక బులియన్‌లో ర్యాలీ కొనసాగుతోంది.

Leave a Reply