రేవంత్ US పర్యటనకు నో
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. చాలా రోజుల క్రితమే అమెరికా పర్యటన అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగశాఖ అనుమతి కోరింది. తాజాగా సీఎం అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించింది. దీంతో తన లండన్ పర్యటన ముగించుకుని రేవంత్ తిరిగి హైదరాబాద్ రానున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు విదేశీ పర్యటన చేయాలంటే ప్రొటోకాల్ ప్రకారం ప్రకారం.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తన అమెరికా పర్యటనకు కేంద్రం నిరాకరించకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. రాజకీయ కోణంలోనే తనకు అనుమతి నిరాకరించారని ఆయన ఆరోపించారు. ప్రపంచస్థాయి సంస్థలను తెలంగాణకు తీసుకురావటమే లక్ష్యంగా అమెరికా పర్యటించాలని తాను నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. తన విదేశీ పర్యటన వికసిత్ భారత్‌కు దోహదపడుతుందని భావించానని ఆయన అన్నారు. అయితే తాను రాకున్నా… అమెరికా పర్యటన కొనసాగించాలని రాష్ట్ర అధికారుల బృందానికి సీఎం రేవంత్ సూచించారు.
