For Money

Business News

నిలకడగా వాల్‌స్ట్రీట్‌

నిన్న భారీగా పెరిగిన అమెరికా మార్కెట్లు ఇవాళ నిలకడగా ఉన్నాయి. యూరో మార్కెట్లు మాత్రం అర శాతం నుంచి ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. అమెరికా సూచీలు కూడా రెడ్‌లోఉన్నా… అన్నీ నామ మాత్రపు నష్టాలే. చిత్రంగా ఇవాళ అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నాస్‌డాక్‌ 0.05 శాతం నష్టపోగా, మిగిలిన రెండు సూచీలు 0.2 శాతం నష్టంతో ఉన్నాయి. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్ 0.33 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక క్రూడ్‌ విషయానికొస్తే అమెరికా క్రూడ్‌తో పాటు బ్రెంట్‌ క్రూడ్‌ కూడా రెడ్‌లో ఉన్నాయి. కాకపోతే చాలా స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. అలాగే బులియన్‌ కూడా నష్టాల్లో ఉన్నాయి. కాని నామ మాత్రపు నష్టాలే. ఒక్కమాటలో చెప్పాలంటే… అన్నీ స్థిరంగా నిలకడగా ఉన్నాయి. మరి క్లోజింగ్‌ సమయానికి ఎలా స్పందిస్తాయో చూడాలి.