వాల్‌స్ట్రీట్: ఐటీలో మళ్ళీ అమ్మకాలు
నిన్న రాత్రి స్థిరంగా ఆరంభమైన అమెరికా మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. రాత్రి మళ్ళీ నాస్‌డాక్ రెండు శాతం క్షీణించింది. ఐటీ షేర్లలతో టెక్నాలజీ షేర్లలో వచ్చి ఒత్తిడి కారణంగా ఎస్ అండ్ పీ 500 సూచీ 1.7 శాతం పడిపోయింది. డౌజోన్స్ స్థిరంగా ఎలాంటి లాభనష్టాలు లేకుండా ముగిసింది. జాబ్ డేటా నిరాశజనకంగా ఉండటంతో డాలర్ మళ్ళీ పెరిగింది. క్రూడ్ ధరలు రాత్రి తగ్గినా.. ఇవాళ మళ్ళీ గ్రీన్‌లో వచ్చాయి.