For Money

Business News

కుప్పకూలి… కోలుకున్న వాల్‌స్ట్రీట్‌

ఒమైక్రాన్‌ భయంతో స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి రాత్రి కూడా కొనసాగింది. డౌజోన్స్‌ ఒకదశలో 800 పాయింట్లు క్షీణించింది.దాదాపు రెండున్నర శాతమన్నమాట. అలాగే ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ భారీగా క్షీణించాయి. కాని క్లోజింగ్‌కల్లా కోలుకుని ఒక శాతం నష్టంతో ముగిశాయి. ట్రజరీ ఈల్డ్స్‌ క్షీణించడంతో డాలర్‌ వెనకడుగు వేస్తోంది. రాత్రి స్వల్పంగా క్షీణించినా… ఇపుడు స్థిరంగా ఉంది. ఇక క్రూడ్‌ ఆయిల్ భారీ పతనం తరవాత కోలుకుంది. ఒకదశలో 69 డాలర్లకు పడిన క్రూడ్‌ క్లోజింగ్‌కల్లా 72 డాలర్లను దాటింది. అమెరికా ఫ్యూచర్స్‌ ఇపుడు అర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి.