For Money

Business News

వాల్‌స్ట్రీట్‌కు జాబ్‌ డేటా షాక్‌

అమెరికా నాన్‌ ఫామ్‌ జాబ్‌ డేటాను కార్మిక శాఖ వెల్లడించింది. మార్కెట్‌ ఈ సారి జాబ్‌ డేటాలో కొత్తగా 1,50,000 ఉద్యోగాలు వచ్చి ఉంటాయని అంచనా వేశారు. అయితే 4,44,000 మందికి నాన్‌ ఫామ్‌ రంగంలో ఉద్యోగాలు వచ్చాయని కార్మిక శాఖ వెల్లడించడంతో…మళ్ళీ మార్కెట్‌లో వడ్డీ రేట్ల భయం ప్రారంభమైంది. జాబ్‌ డేటా చాలా పాజిటివ్‌గా ఉందంటే… ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతున్నట్లే… దీంతో మార్చి నెలలో 0.25 శాతం బదులు 0.5 శాతం చొప్పున వడ్డీ రేట్లు పెరుగుతాయన్న చర్చ మొదలైంది. దీంతో రెండువారాల కనిష్ఠ స్థాయి నుంచి డాలర్‌ కోలుకుంది. మరోవైపు వాల్‌స్ట్రీట్‌లో భారీ నష్టాల నుంచి నాస్‌డాక్‌ స్వల్పంగా కోలుకుంది. నాస్‌డాక్‌ 0.7శాతం లాభంతో ట్రేడవుతోంది. అయితే ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.11 శాతం పెరగ్గా, డౌజోన్స్‌ 0.45 శాతం నష్టంతో ట్రేడవుతోంది.