వాల్‌స్ట్రీట్ నష్టాల్లోనే కాని…
రెండు సెషన్స్‌లో భారీ పతనం తరవాత అమెరికా మార్కెట్లలో అమ్మకాల హోరు తగ్గింది. డౌజోన్స్ ఒక శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీలు 0.77 శాతం నష్టాల్లో ఉండగా, నాస్డాక్ గ్రీన్‌లో ట్రేడవుతోంది. నాస్డాక్ 0.45 శాతం లాభంలో ఉంది. యాపిల్ మినహా మిగిలిన ప్రధాన టెక్ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. ట్విటర్ 4 శాతంపైగా లాభంతో ఉంది. అయితే నాస్డాక్ లాభాలు కొనసాగుతాయా అన్న అనుమానం కల్గుతోంది. దీని కారణం డాలర్ ఇండెక్స్ 0.6 శాతం పెరగడమే. అయితే బాండ్ ఈల్డ్స్ 3.76 శాతం తగ్గడంతో నాస్డాక్ లాభాల్లో క్లోజ్ కావొచ్చని అనలిస్టులు అంటున్నారు. మరోవైపు యూరో మార్కెట్లలో అమ్మకాల హోరు కొనసాగుతోంది. సూచీలన్నీ ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.