For Money

Business News

కుప్ప కూలిన క్రూడ్‌, బులియన్‌

కరెన్సీ మార్కెట్‌లో డాలర్ పరుగు ఆగడం లేదు. కాస్సేపటి క్రితం డాలర్‌ ఇండెక్స్‌ 0.6 శాతం పెరిగి 101.75కు చేరింది. ఇది రెండేళ్ళ గరిష్ఠ స్థాయి. డాలర్‌ జోరుకు చైనా కరోనా కేసులు తోడు కావడంతో క్రూడ్‌ ఆయిల్‌పై తీవ్ర ఒత్తిడి వచ్చింది. మొన్నటి దాకా 113 డాలర్ల వద్ద ఉన్న బ్రెంట్ క్రూడ్‌ ఇవాళ 100 డాలర్లకు క్షీణించింది. ఇవాళ ఏకంగా 5 శాతంపైగా బ్రెంట్‌ తగ్గింది. మరోవైపు బులియన్‌ మార్కెట్‌లో కూడా ఇదే పరిస్థితి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1900 డాలర్ల దిగువకు వచ్చేసింది. ప్రస్తుతం 1896 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం రెండు శాతం క్షీణించగా, వెండి 2.25 శాతం క్షీణించి 23.72 డాలర్లకు పడింది. నేచురల్‌ గ్యాస్‌ తప్ప… మిగిలిన అన్ని రకాల మెటల్స్‌ భారీగా తగ్గుతున్నాయి. కాపర్‌ మూడు శాతంపైగా క్షీణించింది.