నాస్‌డాక్ డౌన్… డౌ అప్
వాల్‌స్ట్రీట్ టెక్నాలజీ షేర్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఇవాళ నాస్‌డాక్ 0.48 శాతం క్షీణించింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.23 శాతం లాభానికే పరిమితమైంది. ఇక డౌజోన్స్ 0.67 శాతం లాభంతో జోరుపై ఉంది. ట్విటర్, ఎన్‌విడియా షేర్లు నాలుగు శాతంపైగా క్షీణించింది. ఏఎండీ, టెస్లా రెండు శాతం తగ్గగా, అమెజాన్ ఒక శాతంపైగా క్షీణించింది. మరోవైపు యూరో మార్కెట్లు మాత్రం భారీ లాభాలతో ముగిశాయి. దాదాపు అన్ని మార్కెట్లు ఒక శాతంపైగా లాభపడ్డాయి. ఇక కరెన్సీ మార్కెట్‌లో డాలర్ దూకుడు కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ 99.80 దాటింది.