For Money

Business News

కోవిడ్‌ వ్యాక్సిన్‌ రూ. 225లకే

18 ఏళ్ళు దాటినవారికి రేపటి నుంచి మూడో డోస్‌ అంటే ప్రికాషన్‌ డోస్‌కు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే కరోనా వ్యాక్సిన్‌ కంపెనీలు సదరు వ్యాక్సిన్‌ ధరను గణనీయంగా తగ్గించాయి. కోవిషీల్డ్‌ను ప్రైవేట్ హాస్పిటల్స్‌కు రూ. 600 అందిస్తామన్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అదార్‌ పూనావాలా ఇవాళ సంచలన ట్వీట్‌ చేస్తారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తరవాత కోవిషీల్డ్‌ ధరను రూ.600 నుంచి రూ. 225కు తగ్గిస్తున్నట్లు ప్రకటంచారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌, క్లినిక్‌లకు తాము విక్రయిస్తామని అన్నారు. ఆయన ట్వీట్ చేసిన పది నిమిషాలకు కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ధరను రూ. 1200 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తరవాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ యజమాని సుచిత్రా ఎల్లా ప్రకటించారు.