గ్రీన్లోనాస్డాక్
యూరప్ మార్కెట్లు నాలుగు శాతం దాకా నష్టాలతో ముగిశాయి. కాని ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్ వెంటనే కోలుకుంది. ఫ్యూచర్స్‌కు భిన్నంగా ట్రేడవుతోంది. ఐటీ, టెక్ షేర్లకు మద్దతు లభించడంతో నాస్డాక్ గ్రీన్‌లో ఉంది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా దాదాపు క్రితం స్థాయి వద్దే ఉంది. ఎకానమి షేర్లకు ప్రాతినిధ్య వహించే డోజోన్స్ మాత్రం రెండు శాతం నష్టాల్లో ట్రేడవుతోంది. అంతక్రితం యూరప్ మార్కెట్లు నాలుగు వాతం దాకా నష్టపోయాయి. యూరోస్టాక్స్ 50 సూచీ 3.64 శాతం నష్టపోయింది. డాలర్ లాభాలు మాత్రం కొనసాగాయి. డాలర్ ఇండెక్స్ 97.42 వద్ద ట్రేడవుతోంది. అలాగే క్రూడ్‌లో కూడా ఉత్సాహం తగ్గింది. మార్చి ఫ్యూచర్స్ బ్రెంట్ క్రూడ్ 103 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. WTI క్రూడ్ మాత్రం 96.69 డాలర్ల వద్ద ఉంది. బులియన్ గ్రీన్‌లో ఉన్నా లాభాలు బాగా తగ్గాయి.