For Money

Business News

మిశ్రమంగా వాల్‌స్ట్రీట్‌

మైక్రోసాఫ్ట్‌ నుంచి ఆకర్షణయీ ఆర్థిక ఫలితాలను ఆశిస్తుండటంతో నాస్‌డాక్‌ 0.6 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలో పెద్ద మార్పు లేదు. కాని డౌజోన్స్‌ మాత్రం 0.26 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ డాలర్‌ స్వల్పంగా క్షీణించింది. వారాంతపు చమురు నిల్వలు ఇవాళ అమెరికాలో భారీగా పెరిగాయి. దీంతో క్రూడ్‌ ఆయిల్ ధరల్లో రెండు శాతం పైగా నష్టపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ 84 డాలర్ల దిగువకు వచ్చింది. ఇక బులియన్‌ మార్కెట్‌లోపెద్ద మార్పు లేదు. గ్రీన్‌లో ఉన్నా ధరలు క్రితం స్థాయిల వద్దే ఉన్నాయి. మరోవైపు ఇవాళ యూరో మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి.