For Money

Business News

నిరాశపర్చిన ఐటీసీ

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించిందని సీఎన్‌బీసీ టీవీ18 పేర్కొంది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 3,697 కోట్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం రూ.3252 కోట్ల నుంచి 13.7 శాతం పెరిగింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం కూడా 12 శాతం వృద్ధితో రూ. 12,103 కోట్ల నుంచి రూ. 13,553 కోట్లకు చేరింది. అలాగే కంపెనీ వ్యయం కూడా 12 శాతం పెరిగి రూ. 9,164 కోట్ల నుంచి రూ.10,258 కోట్లకు చేరింది.